
హైదరాబాద్, వెలుగు: ఫిన్టెక్ కంపెనీ జగిల్ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ రాజ్ పి నారాయణం 2024 హురున్ ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డును అందుకు న్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఇన్నోవేషన్ కోసం కృషి చేసినందుకు దీనిని ప్రదానం చేశారు.
ఈ అవార్డును భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడిన పరిశ్రమ నాయకులకు ఇస్తారు. ఆర్థిక పరిష్కారాల రంగాన్ని మార్చడానికి ఆయన చేసిన సహకారానికి ఈ అవార్డు నిదర్శనమని జగిల్పేర్కొంది.
డాక్టర్ రాజ్ నాయకత్వంలో వ్యాపారాలు, కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే వినూత్న ఆర్థిక పరిష్కారాలను తాము అందిస్తామని తెలిపింది. ఈ గుర్తింపుపై డాక్టర్ నారాయణం స్పందిస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు గల సంస్థ అవార్డును పొందడం సంతోషంగా ఉందని చెప్పారు.