కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్డాక్టర్ రవీందర్‌నాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన పలు రికార్డులను, ఆసుపత్రి లోని ల్యాబ్, ఆపరేషన్థియేటర్, ఇతర గదులను పరిశీలించి శుభ్రత పాటించాలని సూచించారు.
ఎంసీహెచ్ ఇండికేటర్స్, అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి పలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మాలతి, డాక్టర్ కిషోర్, సీహెచ్‌వో ఎండీ వలీవుద్దీన్ పాల్గొన్నారు.