న్యూఢిల్లీ: తయారీ సమస్యలు కారణంగా యూఎస్ మార్కెట్ నుంచి డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఎఫ్‌డీసీ లిమిటెడ్ కొన్ని జనరిక్ మెడిసిన్స్‌ను రీకాల్ చేసుకుంటున్నాయి. యూఎస్ ఎఫ్‌డీఏ రిపోర్ట్ ప్రకారం, మోర్ఫైన్ సల్ఫేట్ ఎక్స్‌టెండ్ రిలీజ్ ట్యాబ్లెట్లను డా.రెడ్డీస్ యూఎస్ సబ్సిడరీ రీకాల్ చేసుకుంటోంది. ఈ ట్యాబ్లెట్లను నొప్పిని తగ్గించడంలో వాడుతున్నారు. మొత్తం 15 ఎంజీ ట్యాబ్లెట్లు ఉన్న 2,040 బాటిళ్లను ఈ కంపెనీ రీకాల్ చేసుకుంటోంది. దీంతోపాటు 30 ఎంజీ ట్యాబ్లెట్లు గల 532 బాటిళ్లనూ రీకాల్ చేసుకుంటోంది.
డా.రెడ్డీస్ కిందటి నెల 22 న క్లాస్ 2 రీకాల్‌ను మొదలు పెట్టింది. మరోవైపు ముంబై బేస్డ్ కంపెనీ ఎఫ్‌డీసీ లిమిటెడ్ 1,55,232 టిమోలో మాలియేట్ ఆఫ్తాల్మిక్ సొల్యూషన్స్ డ్రగ్ బాటిళ్లను రీకాల్ చేసుకుంటోంది. గ్లాకోమా కారణంగా కళ్లలో పెరిగే హై ప్రెజర్‌ను తగ్గించడానికి ఈ డ్రగ్‌ను వాడుతున్నారు. కంటైనర్‌లో లోపం ఉండడంతో ఈ రీకాల్‌ను చేపడుతోంది.