డా.రెడ్డీస్‌ లాభం 1,392 కోట్లు .. 14 శాతం పెరిగిన రెవెన్యూ

డా.రెడ్డీస్‌ లాభం 1,392 కోట్లు .. 14 శాతం పెరిగిన రెవెన్యూ
  • ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీపై పెరిగిన ఖర్చులు
  • రాణించిన జనరిక్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్ ఫార్మా కంపెనీ డా. రెడ్డీస్‌‌‌‌‌‌‌‌ ల్యాబొరేటరీస్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ1) ‌‌‌‌‌‌‌‌లో రూ.1,392 కోట్ల నికర లాభాన్ని సాధించింది. పన్ను చెల్లింపులు  పెరగడంతో  కంపెనీ నెట్ ప్రాఫిట్ ఏడాది ప్రాతిపదికన తగ్గింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,402 కోట్ల నికర లాభాన్ని  ప్రకటించింది. రెవెన్యూ మాత్రం రూ.6,738 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.7,672.70 కోట్లకు చేరుకుంది. డా. రెడ్డీస్‌‌‌‌‌‌‌‌కు క్యూ1 లో రూ.7,242 కోట్ల రెవెన్యూ, రూ.1,351 కోట్ల నికర లాభం వస్తాయని ఎనలిస్టులు అంచనా వేశారు. 

ఈ అంచనాలను కంపెనీ ఫలితాలు అధిగమించాయి.  ఇండియాతో సహా నార్త్ అమెరికాలో  డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌ జనరిక్ మందుల అమ్మకాలు పెరిగాయి.  ఫలితంగా రెవెన్యూ వృద్ధి చెందింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ జనరిక్ మందుల అమ్మకాలు 15 శాతం పెరిగాయి.  కొత్త మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తేవడంతో పాటు ఇండియాలో వ్యాక్సిన్ పోర్టుఫోలియో మంచి పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ చేయడం కలిసొచ్చింది. అయినప్పటికీ  డా.రెడ్డీస్ ఇబిటా (పన్నులు, వడ్డీలకు ముందు ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌)  మార్జిన్ ఏడాది ప్రాతిపదికన 29 శాతం నుంచి 28.2 శాతానికి తగ్గింది. 

క్యూ1 లో  కంపెనీ  రూ. 2,159.90 కోట్ల ఇబిటా సాధించింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీకి)  ఖర్చులు పెంచామని, కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెవెన్యూలో  7.4 శాతం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీకి కేటాయిస్తే, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.1 శాతం కేటాయించామని డా.రెడ్డీస్ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. బయోసిమిలర్, జనరిక్ మెడిసిన్ల డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ పెట్టుబడులు పెంచామని తెలిపింది. 

అలానే ఆంకాలజీ  మందులపై కూడా ఫోకస్ పెట్టామంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కంపెనీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ ఖర్చులు రూ.2,269 కోట్లుగా ఉన్నాయి.   కొత్త సంవత్సరాన్ని  గొప్పగా మొదలు పెట్టామని డా. రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కంపెనీ వృద్ధిలో జనరిక్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ కీలకంగా ఉందని తెలిపారు. కీలక బిజినెస్‌‌‌‌‌‌‌‌లపై ఫోకస్ పెంచుతామని,  బయోలాజిక్స్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌పై పెట్టుబడులు పెట్టామని జీవీ ప్రసాద్ వివరించారు. 

మరికొన్ని  హైలైట్స్‌‌‌‌‌‌‌‌..

1.  యూఎస్‌‌‌‌‌‌‌‌ వెలుపల మార్కెట్లలో నికోటిన్‌‌‌‌‌‌‌‌ రిప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ థెరపిలో వాడే నికోటినెల్‌‌‌‌‌‌‌‌, సంబంధిత బ్రాండ్లను హలియన్‌‌‌‌‌‌‌‌ పీఎల్‌‌‌‌‌‌‌‌సీ నుంచి 500 మిలియన్ పౌండ్లకు  డా.రెడ్డీస్ కొనుగోలు చేసింది. 
2. న్యూట్రిషనల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమ్మేందుకు నెస్లే ఇండియాతో జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఏర్పాటు చేసింది. 
3. నోవార్టిస్ ఫార్మా ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌సీకి చెందిన రెండు యాంటీ డయాబెటిస్ బ్రాండ్లు గల్వస్‌‌‌‌‌‌‌‌, గల్వస్‌‌‌‌‌‌‌‌ మెట్‌‌‌‌‌‌‌‌ను రష్యా  రిటైల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అమ్మేందుకు  నోవార్టిస్‌‌‌‌‌‌‌‌తో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకుంది.
4.  మైగ్రేన్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో వాడే  నెరివియో డివైజ్‌‌‌‌‌‌‌‌ను జర్మనీ, యూకే, స్పెయిన్‌‌‌‌‌‌‌‌, సౌత్ ఆఫ్రికాలో లాంచ్ చేసింది. 
5. యూఎస్‌‌‌‌‌‌‌‌లో సైక్లోఫాస్పోమైడ్‌‌‌‌‌‌‌‌ ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌ను అమ్మేందుకు ఇంజీనస్‌‌‌‌‌‌‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి రైట్స్ దక్కించుకుంది. అలానే డినోసుమాబ్‌‌‌‌‌‌‌‌ బయోసిమిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యూఎస్‌‌‌‌‌‌‌‌, యూరప్‌‌‌‌‌‌‌‌, యూకేలో అమ్మేందుకు అల్వాటెక్‌‌‌‌‌‌‌‌తో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకుంది.
 

మరిన్ని వార్తలు