
న్యూఢిల్లీ: ఏపీఐలలో ఒకదానికి రిఫరెన్స్ స్టాండర్డ్ దిగుమతికి సంబంధించి మార్గదర్శకాలు పాటించనందుకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌పై మెక్సికో డ్రగ్ రెగ్యులేటర్ రూ.27 లక్షల జరిమానా విధించింది.
అంతేగాక, ఇన్‌వాయిస్ తేదీలో లోపం వల్ల కూడా జరిమానా పడిందని ఈ ఫార్మా సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డాక్టర్ రెడ్డీస్ షేర్లు గురువారం 1.30 శాతం నష్టంతో రూ.1,228 వద్ద ముగిశాయి.