న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సోమవారం స్విట్జర్లాండ్‌కు చెందిన తమ అనుబంధ సంస్థ హాలియన్ బ్రాండ్లను కొనుగోలు చేసినట్టు తెలిపింది. అమెరికా బయటి హాలియన్ నికోటిన్రిప్లేస్మెంట్థెరపీ (ఎన్ఆర్టీ) కేటగిరీలోని కన్జూమర్హెల్త్ బ్రాండ్లను దక్కించుకున్నట్టు తెలిపింది.
హాలియన్ గ్రూప్ కంపెనీ అయిన నార్త్‌స్టార్ స్విట్జర్లాండ్ ఎస్ఏఆర్ఎల్ షేర్లను దక్కించుకోవడం ద్వారా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఎస్ఏ ఈ కొనుగోలును పూర్తి చేసింది. ఇందుకోసం 458 మిలియన్పౌండ్లను ముందస్తుగా చెల్లించింది.