న్యూఢిల్లీ: మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా (ఒక రకమైన క్యాన్సర్) చికిత్స కోసం టోరిపాలిమాబ్ అనే మందును విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గురువారం తెలిపింది. నాసోఫారింజియల్ కార్సినోమా (ఎన్పీసీ) అనేది గొంతు పైభాగంలో వస్తుంది. తల, గొంతుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కంపెనీ కొత్త బయోలాజికల్ ఎంటిటీ (ఎన్‌బీఈ) టోరిపాలిమాబ్‌ను ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ , మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఈ డ్రగ్‌ను ఆమోదించాయని ప్రకటించింది. మనదేశంలో జైటోర్వి బ్రాండ్ పేరుతో ఈ డ్రగ్‌ను మార్కెట్ చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.