న్యూఢిల్లీ : రక్తంలో అధిక కాల్షియం స్థాయులు, హైపర్ పారా థైరాయిడిజం చికిత్సకు ఉపయోగించే 3.3 లక్షల మందుల బాటిళ్లను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ అమెరికాలో వెనక్కి (రీకాల్) రప్పిస్తోంది. తయారీ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ప్రకారం 3,31,590 సినాకాల్‌సెట్ టాబ్లెట్లను డాక్టర్ రెడ్డీస్ రీకాల్ చేస్తోంది.
పరిమితి కంటే ఎక్కువ మలినాలు ఉండటం కారణంగా రీకాల్ అయ్యాయని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్30 ఎంజీ డోసు గల 2,85,126 సినాకాల్‌సెట్ ట్యాబ్లెట్‌లను రీకాల్ చేస్తోంది. అంతేకాకుండా 60 ఎంజీ, 90 ఎంజీ బలం కలిగిన బాటిళ్లను కూడా వెనక్కి రప్పిస్తోంది. ఇవన్నీ ఇండియా ప్లాంట్లలోనే తయారయ్యాయి