సిప్లాలో వాటాను ..కొననున్న డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

సిప్లాలో వాటాను ..కొననున్న డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

న్యూఢిల్లీ :  సిప్లా ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసేందుకు ఫార్మా కంపెనీ డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్ కంపెనీ బైన్ క్యాపిటల్ చేతులు కలిపే అవకాశం కనిపిస్తోంది. టొరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మా, పీఈ కంపెనీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్ సిప్లాలో వాటాలు కొనుగోలు చేసేందుకు  ప్రమోటర్లతో చర్చలు జరుపుతున్నాయి కూడా. ఒకవేళ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయితే డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిప్లా విలీన  సంస్థ దేశంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తుంది. 

మార్కెట్ స్పెక్యులేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మాట్లాడబోమని డా.​ రెడ్డీస్ ప్రతినిధి పేర్కొన్నారు. సిప్లాలో వాటాల కొనుగోలు చేయడంలో టొరెంట్ ఫార్మా ముందువరసలో ఉందని మీడియా రిపోర్ట్స్ వెలువడుతున్నాయి. బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిడ్ కంటే 30 శాతం ఎక్కువ ఆఫర్ చేస్తోందని పేర్కొన్నాయి. మంగళవారం సిప్లా షేర్లు ఇంట్రాడేలో 2 శాతం పెరిగాయి. డాక్టర్​ రెడ్డీస్ షేర్లు 1.4 శాతం పడ్డాయి.