న్యూఢిల్లీ: శ్రీకాకుళంలోని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియెంట్స్ తయారీ సౌకర్యం కోసం యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్రిపోర్ట్ అందిందని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ శుక్రవారం తెలిపింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డిఎ) తనిఖీని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ (వీఏఐ)గా వర్గీకరించింది. తనిఖీ ముగిసిందని కూడా నిర్ధారించిందని హైదరాబాద్‌కు చెందిన ఈ డ్రగ్ కంపెనీ తెలిపింది.
యూఎస్ఎఫ్డీఏ ప్రకారం, వీఏఐ అంటే అభ్యంతరకర పరిస్థితులు ఉన్నట్టు భావిస్తారు. అయినప్పటికీ రెగ్యులేటరీ చర్య తీసుకోవడానికి లేదా సిఫార్సు చేయడానికి ఏజెన్సీ సిద్ధంగా లేదని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ఈ ఏడాది జూన్ 7న శ్రీకాకుళం యూనిట్‌ను పరిశీలించిన తర్వాత యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నాలుగు పరిశీలనలతో ఫారం 483ని జారీ చేసిందని తెలిపింది.