జహీరాబాద్, వెలుగు : కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియమించిన మూడు కమిటీలతో పాటు, మరో ప్రైవేటు సంస్థ జహీరాబాద్ ఏరియా హాస్పిటల్‌కు 4 అవార్డులు ప్రకటించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ శేషు రావు తెలిపారు. శనివారం సూపరింటెండెంట్ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వారు వివరాలు వెల్లడించారు.
జహీరాబాద్ ఏరియా హాస్పిటల్వైద్యసేవలు అందించడంలో మంచి పేరు తెచ్చుకుందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నియమించిన ఎన్కాస్, ముస్కాన్, లక్ష్య ప్రోగ్రాంలలో ఈ అవార్డులు ప్రకటించారన్నారు. దీంతో ప్రతి సంవత్సరం హాస్పిటల్‌కు రూ. 25 లక్షల చొప్పున 3 సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. ఢిల్లీకి చెందిన బీఎఫ్ హెచ్ అనే ప్రైవేట్ సంస్థ జాహీరాబాద్ ఏరియా హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారన్నారు.
ఇకముందు కూడా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోగులకు మెరుగైన సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటామన్నారు. హాస్పిటల్‌కు కేంద్ర బృందం గుర్తింపు ఇవ్వడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌ఎస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.