కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌ను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలి: డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ లోథ్‌‌‌‌‌‌‌‌

హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో పనిచేస్తున్న 1,445 మంది కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని యూనివర్సిటీ కాంట్రాక్ట్​టీచర్స్ జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ లోథ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సోమవారం కేయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లు విధులు బహిష్కరించి, వీసీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ 143 రోజుల నుంచి వర్సిటీల్లో సదస్సులు, రౌండ్‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌  మీటింగ్‌‌‌‌‌‌‌‌లు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ నాయకులు డాక్టర్ మధుకర్‌‌‌‌‌‌‌‌రావు, జరుపుల చందులాల్, చంద్రశేఖర్, జి.రమేశ్‌‌‌‌‌‌‌‌, రఘువర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్డీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.