సునీత కృష్ణన్ పోరాటం ఆదర్శం : మంత్రి సీతక్క

సునీత కృష్ణన్ పోరాటం ఆదర్శం : మంత్రి సీతక్క
  •     ‘ఐయామ్ వాట్ ఐయామ్’  బుక్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు : సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న అమ్మాయిలు, రేప్ బాధితుల జీవితాల్లో సునీతా కృష్ణన్ కొత్త వెలుగులు నింపారని, ఆమె సర్వేవర్ కాదని సేవియరని ప్రశంసించారు. శుక్రవారం ఆమె డా. సునీతా కృష్ణన్ పుస్తకం ‘ఐయామ్ వాట్ ఐయామ్’ బుక్ ను బేగంపేటలోని ఓ హోటల్ లో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం సీతక్క మాట్లాడుతూ.. తన గాయాలను ఉద్యమాలుగా మలిచిన సునీతా కృష్ణన్ తనకు కూడా స్ఫూర్తేనని తెలిపారు. దాడులకు భయపడకుండా ఎందరో అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడారని గుర్తుచేశారు.