పట్టభద్రులకు అందుబాటులో ఉంటా

పట్టభద్రులకు అందుబాటులో ఉంటా

మంచిర్యాల, వెలుగు: అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉండి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో కృషి చేస్తానని పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో జిల్లాస్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేయగా.. టీచర్లు, ఉద్యోగులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, మైన్స్​లో పని చేసే పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ కచ్చితంగా అమలు చేస్తానని వెల్లడించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. మిగతా 4 సంవత్సరాలు కూడా అదే విధంగా ఉద్యోగ రూపకల్పనలో ముందుండాలని ఆకాంక్షించారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సమ్మెలు మంచి పరిణామం కాదని.. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కేజీబీవీ టీచర్లు సమ్మె విరమించి విధులకు హాజరయ్యేలా ఏదైనా హామీ ఇవ్వాలని కోరారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు.