
చేవెళ్ల, వెలుగు: బోదకాలు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థికసాయం అందించి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి కుమారుడు డాక్టర్ వైభవ్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నాడు. చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామానికి చెందిన చనిగళ నర్సింలు కొంతకాలంగా బోదకాళ్ల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది తెలుసుకున్న డాక్టర్ వైభవ్ రెడ్డి ఆదివారం నర్సింలును కలిసి, అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆపరేషన్ కోసం రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.