జ్వరాలు వస్తున్నాయి..గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్లు

జ్వరాలు వస్తున్నాయి..గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్లు

 జ్వరాలతో గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్​ వసుంధర కామినేని

ఎల్బీనగర్, వెలుగు: ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరాలు వస్తే గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని ఎల్బీనగర్ లోని కామినేని దవాఖాన ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వసుందర కామినేని సూచించారు. జ్వరం కారణంగా ప్లేట్ లెట్లు తగ్గడం, కీళ్ల నొప్పులు, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆయాసం రావడం, రక్తం గడ్డ కట్టకుండా హేమరేజ్​ఏర్పడి షాక్ లోకి వెళ్తున్నారని, దీంతో ఐసీయూలో చేరాల్సి వస్తోందని చెప్పారు. 

ఆక్సిజన్ శాచ్యురేషన్ పడిపోతోందన్నారు. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు, ఐదో నెల, ప్రసవానికి ముందు ఎలాంటి జ్వరం వచ్చినా గైనకాలజిస్టును, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులను లేదా ఫిజీషియన్ ను సంప్రదించాలన్నారు. ఫంక్షన్స్, పూజలకు దూరంగా ఉండాలని, వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాలన్నారు. ఇన్ని జాగ్రత్తలు పాటించినా 24 గంటల వరకు జ్వరం తగ్గకుండా ఉంటే డాక్టర్​ను కలవాలన్నారు. గైనకాలజీ డాక్టర్ శారదా, డాక్టర్లు మేనక, అర్చన, ప్రసన్న పాల్గొన్నారు.