యాదాద్రి, వెలుగు: రాజకీయ పార్టీల్లో సామాజిక న్యాయం లేకుండా పోయిందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ మండిపడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలను రెడ్డీలే శాసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన, ఎవరూ పెట్టకుంటే తాము పవర్లోకి రాగానే పెడతామన్నారు.
రాజకీయ పార్టీలు రెడ్డీలకే టికెట్లు ఇస్తున్నాయని , తమ పార్టీ మాత్రం ఓసీలకు టికెట్లు ఇవ్వదని తేల్చి చెప్పారు. ప్రజలు తమ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. మీటింగ్లో పార్టీ లీడర్లు నరేందర్, గాలయ్య, కొత్త నర్సింహా, సాయిని యాదగిరి ఉన్నారు.