
హైదరాబాద్, వెలుగు: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. ఈ బిల్‌ను తమ వెబ్ సైట్ లో www.labour.telangana.gov.in అందుబాటులో ఉంచినట్టు సోమవారం కార్మికశాఖ పత్రిక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు తెలపాలని ప్రభుత్వం సూచించింది. ఆన్ లైన్ లో tg.gig.labour@gmail.com మెయిల్ ఐడీకి, ఆఫ్ లైన్ లో “సజెషన్స్ ఆన్ గిగ్ వర్కర్స్ బిల్” అని కవర్ పేజీపై రాసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని టాస్క్ భవన్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపాలని కార్మిక శాఖ సూచించింది.