PradeepRanganathan: దళపతి విజయ్ను కలిసిన డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఎందుకో తెలుసా?

PradeepRanganathan: దళపతి విజయ్ను కలిసిన డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఎందుకో తెలుసా?

టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ అండ్ డ్రాగన్ మూవీ టీమ్ దళపతి విజయ్ను కలిశారు. సినిమా భారీ విజయం దక్కడంతో పాటు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్న సందర్భంగా విజయ్ ను కలిసే అవకాశం దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్ను కలిసిన తర్వాత హీరో ప్రదీప్ రంగనాథ్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. " కలకురీంగా బ్రో.. దళపతి నుండి ఇది వింటే నాకు ఎలా అనిపిస్తుంది? నేను ఎలా ఉండిపోయానో మీరందరూ అర్థం చేసుకోగలరని నాకు తెలుసు. దళపతి విజయ్ సర్ మాట్లాడిన మాటలు, మాకిచ్చిన విలువైన సమయానికి ధన్యవాదాలు సార్" అని X వేదికగా ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. 

'డ్రాగన్' దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన కల నిజమైందని X లో తెలిపాడు. దర్శకుడిగా తనను తాను స్థిరపరచుకోవడానికి చాలా కష్టపడి పనిచేసానని, విజయ్ ని కలవాలని ఎప్పుడూ కలలు కనేవాడినని, ఏదో ఒక రోజు అతనితో కలిసి పనిచేయాలని కూడా ఆశించానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ కల నెరవేరుతుందో లేదో తెలియకపోయినా, విజయ్ ని కలవడం అనేది ఒక కల మాత్రమే అని చెప్పుకొచ్చాడు. విజయ్ తనను "గొప్ప రచన, బ్రో" అని ప్రశంసించాడని, అది తనను భావోద్వేగానికి గురిచేసిందని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపారు. 

నిర్మాత అర్చన కల్పతి కూడా Xలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది.  "ఇది మా డ్రాగన్ క్షణం! మా కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు విజయ్ సార్. ఇది నిజంగా గొప్ప క్షణం. విజయ్ తో సమావేశం మా డ్రాగన్ టీమ్ కు మరింత ప్రేరణనిచ్చింది, డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద హృదయాలను గెలుచుకుంటూనే ఉంది" అని తెలిపింది.

తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్  గా వచ్చింది. ఫిబ్రవరి 21న థియేటర్స్కి వచ్చిన డ్రాగన్..వరల్డ్ వైడ్గా రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. మార్చి 21 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

ఇకపోతే.. ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాలేజీ లైఫ్, జాబ్ లైఫ్ ని బేస్ చేసుకుని రాసిన సీన్స్ యూత్ ని కట్టి పడేశాయి. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టింది.