KayaduLohar: స్టార్ హీరోతో కయాదు లోహర్ రొమాన్స్.. డ్రాగన్ బ్యూటీ నెక్స్ట్ సినిమా ఇదే

KayaduLohar: స్టార్ హీరోతో కయాదు లోహర్ రొమాన్స్.. డ్రాగన్ బ్యూటీ నెక్స్ట్ సినిమా ఇదే

డ్రాగన్ మూవీ హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) క్రేజీ మాములుగా లేదు. తెలుగు, తమిళ భాషల్లోను వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. లేటెస్ట్గా తమిళ స్టార్ హీరో శింబు సినిమాకి ఒకే చెప్పినట్టు సినీవర్గాల సమాచారం. శింబు 49 మూవీలో హీరోయిన్గా కయాదు లోహర్ సంతకం చేసిందట. ఈ విషయంపై మేకర్స్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

'పార్కింగ్' మూవీ డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ శింబు 49కి దర్శకత్వం వహించనున్నాడు. సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో దుబాయ్‌లో స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ప్రస్తుతం కయాదు తమిళ హీరో అధర్వకు జోడీగా 'హృదయం మురళి' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ ఆకాష్ భాస్కరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

అలాగే తెలుగులో విశ్వక్ సేన్‌‌ హీరోగా అనుదీప్ తెరకెక్కిస్తున్న ‘ఫంకీ’మూవీ కోసం ఆమెను సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ అయితే రాలేదు. 

ALSO READ | Mohan babu birthday: తండ్రి బర్త్ డే రోజున మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్.. మిస్ అవుతున్నానంటూ..

‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌‌’ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌‌కు జంటగా ఆమె నటించింది. తొలిచిత్రంతోనే తమిళనాట విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు కుర్రకారును కూడా ఫిదా చేసింది. నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్తేమీ కాదు.

గతంలో శ్రీవిష్ణుకు జంటగా ‘అల్లూరి’ అనే చిత్రంలో నటించింది. కానీ అంతగా గుర్తింపును అందుకోలేదు. ఇప్పుడు ‘డ్రాగన్‌‌’ హిట్ అవడంతో పాటు తన నటన యూత్‌‌కు నచ్చడంతో తనకు ఫాలోయింగ్ పెరుగుతోంది.