OTT Movies: ఓటీటీకి వచ్చిన రెండు తమిళ కొత్త సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies: ఓటీటీకి వచ్చిన రెండు తమిళ కొత్త సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

గత నెల (2025 ఫిబ్రవరి 21న) థియేటర్స్కి వచ్చిన రెండు కొత్త సినిమాలు ఓటీటీకి వచ్చాయి. అందులో ఒకటి వందకోట్లకి పైగా వసూళ్లు సాధిస్తా, మరొకటి యావరేజ్ టాక్తో యూత్ని ఆకట్టుకుంది. అయితే, ఈ రెండు సినిమాలు తమిళంలో తెరకెక్కి తెలుగులో రిలీజ్ అవ్వడం విశేషం. మరి ఆ సినిమాలేంటో? అవెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం. 

డ్రాగన్:

లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ (Dragon). తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్  గా వచ్చింది. ఫిబ్రవరి 21న థియేటర్స్కి వచ్చిన డ్రాగన్..వరల్డ్ వైడ్గా రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

Also Read:-బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ట్విస్ట్..

ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాలేజీ లైఫ్, జాబ్ లైఫ్ ని బేస్ చేసుకుని రాసిన సీన్స్ యూత్ ని కట్టి పడేశాయి. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టింది. దాంతో తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

డ్రాగన్ ఓటీటీ:

డ్రాగన్ మూవీ నేడు (మార్చి 21) నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇవాళ (మార్చి 21న) నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.  "కొన్ని డ్రాగన్లు అతిగా కోప్పడవు. ఎందుకంటే వాటి కమ్‍బ్యాక్ చాలా హాట్‍గా ఉంటుంది. మార్చి 21న డ్రాగన్ చిత్రం తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది" అని నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది.

ఈ సినిమా రిలీజైన సరిగ్గా నెల రోజుల్లోనే ఓటీటీకి రావడం విశేషం. ఓరి దేవుడా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్స్గా నటించారు.

జాబిలమ్మ నీకు అంత కోపమా:

స్టార్ హీరో ధనుష్ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. తమిళంలో 'ఎన్ మెల్ ఎన్నడి కోబమ్' (NEEK).పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం రూ.10 కోట్లు కూడా వసూళ్లు చేయకపోయింది. దాంతో నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. 

నేడు శుక్రవారం (మార్చి 21) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది ఈ సందర్భంగా మేకర్స్ అధికారిక పోస్టర్ను రిలీజ్ చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

కథేంటంటే:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన హీరో ప్రభు (పవీష్ నారాయణ్) చెఫ్ అయ్యి తన వంటల రుచి అందరికీ చూపించి పెద్ద హోటల్ జబ కొట్టి సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓ పార్టీలో అనుకోకుండా నీలా (అనికా సురేంద్రన్) పరిచయం ఏర్పడి ప్రేమకి దారితీస్తుంది. దీంతో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు.. కానీ నీలా తండ్రి (శరత్ కుమార్) వీరి పెళ్ళికి ఒప్పకోకపోగా ప్రభు నచ్చలేదంటూ అవమానిస్తాడు.

ఆ తర్వాత బ్రేకప్ అయ్యి ఎవరిలైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు.. ఆ తర్వాత ప్రభుకి తన స్కూల్ ఫ్రెండ్ ప్రీతీ(ప్రియా ప్రకాష్ వారియర్) పెళ్లి సంబంధం వస్తుంది. ప్రభు కూడా ఒకే చెబుతాడు. కానీ ప్రభు పెళ్లి జరిగే సమయానికి నీలా కూడా తన పెళ్లి కార్డుని ప్రభుకు పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి ప్రభు పెళ్లి ప్రీతితో జరిగిందా.. లేక నీలాతో జరిగిందా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.