సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం పాటు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫూట్ సాగును ఎంచుకొని మంచి ఆదాయం పొందుతున్నారు. పంజాబ్ కు చెందిన అమన్‌దీప్ సింగ్ అనే యువకుడు గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుని జీవనోపాధి కోసం గుజరాత్ వెళుతున్నాడు. అతని ప్రయాణించే రోడ్డులో ... గుజరాత్‌లో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్‌ను కనుగొన్నాడు. దాని సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అతను పంజాబ్‌లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం ప్రారంభించాడు.
. అమన్ దీప్ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసిన తరువాత సేంద్రియ వ్యవసాయం చేసి విజయం సాధించాడు. ఇప్పుడు, అతను అగ్రిటెక్, సారో ఎగ్జిమ్, 12కి పైగా డ్రాగన్ ఫ్రూట్ రకాలను ఉత్పత్తి చేస్తూ, ఏటా ఎకరాకు ₹15 లక్షలు ఆర్జిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పంజాబ్ లో డిగ్రీ చదివిన అనుదీప్ డ్రాగన్ ఫ్రూట్ . ఎకరానికి రూ15 లక్షలు ఆదాయమూ పొందే వీలుండడంతో రైతులు హుషారుగా పంట వేస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్‌తో రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు 15లక్షల రూపాయల ఆదాయం వస్తుండడంతో ఈ పంటను సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌ను ఎత్తుగా ఉండే నేలల్లో పంట వేయాలి. ఒక మొక్క రూ.60లకు లభిస్తుంది. నర్సరీలలో మొక్కలు దొరుకుతాయి. ముందుగా భూమిని చదును చేసుకున్న తర్వాత సిమెంట్ స్తంభాలు నాటాలి. ఒక స్తంభానికి, మరో వరుస స్తంభానికి మధ్య ఎనిమిది ఫీట్ల దూరం ఉండాలి. ఎత్తు ఏడు ఫీట్ల వరకు ఉండాలి. ప్రతి స్తంభం పైభాగంలో సిమెంట్ బిల్లలు అమర్చాలి.
డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటిన రెండు సంవత్సరాలకు పంట చేతికి వస్తుంది. ఒకసారి పంట ప్రారంభమైన తర్వాత 20 సంవత్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఎకరానికి సుమారు రూ.5లక్షల పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 15 లక్షల ఆదాయం వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్స్‌తో లాభాలు వస్తుండడంతో రైతులు ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు ముళ్లు ఉండడం వల్ల కోతుల బెడద కూడా ఉండదు. ఇందులో అంతర పంటగా పుచ్చ, కర్బూజతో పాటు కూరగాయలు సాగు కూడా చేసుకోవచ్చు. తద్వారా రైతుకు అదనపు ఆదాయం వస్తుంది.