PradeepRanganathan:ప్రదీప్ రంగనాథన్-మైత్రి మేకర్స్ మూవీ అనౌన్స్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

PradeepRanganathan:ప్రదీప్ రంగనాథన్-మైత్రి మేకర్స్ మూవీ అనౌన్స్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

లవ్ టుడే మూవీ ఫేమ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మంచి లవ్ అండ్ ఎమోషనల్ మెసేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగులో కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి తమిళ్ కి ఈక్వెల్ గా తెలుగులో కూడా కలెక్షన్స్ వచ్చాయి. 

దీంతో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా అఫర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాని కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్‌ డైరెక్ట్ చేయనున్నాడు. బుధవారం (మార్చి 26)న ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమాని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని మొదలైంది.  

లేటెస్ట్గా (PR04) అనే వర్కింగ్ టైటిల్తో ఉన్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇందులో ప్రదీప్కు జోడిగా ప్రేమలు హీరోయిన్ మమిత బైజు నటిస్తుంది. ఇందులో సీనియర్ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండవ తమిళ ప్రాజెక్ట్ PR04.ఈ సినిమాకు యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ స్వరాలూ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ఎడిటర్: భరత్ విక్రమన్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమ రామసామి ఉన్నారు. 

ALSO READ | RC16 Tittle and First Look Update: చేతిలో బీడీ.. కర్లీ హెయిర్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేశాడా..?

కోమలి మూవీతో డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే మూవీలో హీరోగా చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ దక్కించుకున్నాడు. వరల్డ్ వైడ్గా డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. మార్చి 21 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.