
మ్యాన్ ఆఫ్ మాసెస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త. వార్-2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. 2025 ఆగస్టు 14న ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వార్2 షూటింగ్ పూర్తవ్వడంతో.. తదుపరి మూవీపై దృష్టి పెట్టింది మూవీ టీమ్. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న అప్ కమింగ్ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది.
ప్రశాంత్ నీలో-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మూవీకి టెంటేటివ్ గా ‘డ్రాగన్’ అనే పేరును ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ వార్-2 షూటింగ్ లో బిజీగా ఉండటంతో.. రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్ లేకుండా ఉండే ఇతర సీన్స్ కొన్ని కంప్లీట్ చేశాడు నీల్. ఇప్పుడు అందుబాటులోకి రావడంతో.. మంగళూర్ లో మరో షెడ్యూల్ కు సిద్ధం అయ్యింది మూవీ టీమ్.
అందుకోసం ఎన్టీఆర్ ఇవాళ (ఏప్రిల్ 20) కర్ణాటకకు బయలుదేరాడు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వెళ్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ లతో కలిసి బెంగళూరు వెళ్లారు. మంగళవారం మంగళూరుని కుంటా ప్రాంతంలో షూట్ మొదలవుతుంది. అక్కడ సీక్వెన్స్ యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు.
అయితే ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ ఫిమేల్ లీడ్ లో నటించనున్నట్లు ర్యూమర్స్ వస్తున్నాయి. అయితే సినిమా కాస్టింగ్ గురించి అఫీషియల్ గా మూవీ టీమ్ కన్ఫామ్ చేయలేదు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.