జీహెచ్ఎంసీ అధికారులను దుర్వాసన సమస్య వేధిస్తోంది. ఏళ్ల తరబడి కంపులోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ముక్కుపలిగే దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. జీహెచ్ ఎంసీ వార్తలు, ప్రకటనలను నగర ప్రజలకు అందించే బల్దియా ప్రజా సంబంధాల శాఖను ఈ సమస్య తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. పీఆర్ సెక్షన్ లో సీపీఆర్వోతో పాటు ఇతర అధికారులు,సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. ఒకపక్కహుస్సేన్ సాగర్ నాలా ద్వారా వచ్చే మురుగువాసన, మరోవైపు జీహెచ్ఎంసీలోని 7 ప్లోర్లకు చెందిన టాయిలెట్లు, మరుగుదొడ్ల పైపులైన్లు, నాలా మ్యాన్ హోల్ వంటివి సీపీఆర్వోసెక్షన్ కు ఆనుకొనే ఉన్నాయి. దీంతో రెగ్యూలర్ గా నాలా మ్యాన్ హోల్ నుండి కంపువాసన వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షా కాలంలో పరిస్థితి మరిం తదారుణంగా ఉంటోంది. నాలా మ్యాన్ హోల్ ఓవర్ ఫ్లో అయి.. పీఆర్ సెక్షన్ లోకి మురుగునీరు చేరుతుంది. దాంతో సిబ్బంది పొద్దంతా ముక్కు మూసుకునే పనిచేయాల్సి వస్తోంది.గతంలో ఉన్నతాధికారుల దృష్టికి ఈసమస్య తీసుకెళ్లగా విజిట్ చేసి వదిలేశారని,ఇప్పటికైనా పీఆర్ ఆఫీసులో మురుగు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు.