హైదరాబాద్, వెలుగు: సిటీలో మెయిన్రోడ్ల నుంచి గల్లీ రోడ్ల దాకా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. మురుగంతా రోడ్లపైన పారుతుండగా వాహనదారులు, జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా మురుగు ఆగకుండా పారుతుండడంతో స్థానికులు దుర్వాసన తట్టుకోలేకపోతున్నారు. చౌరస్తాల్లో సిగ్నల్స్పడిన సమయంలో మురుగులోనే బైక్లను నిలపాల్సి వస్తోందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీవరేజీ నిర్వహణ సరిగా లేకనే సమస్యలు వస్తున్నాయి. ప్రతిసారి ఒకేచోట డ్రైనేజీ లీకేజ్ అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కొన్ని ప్రాంతాల్లో వారం, 10 రోజులుగా ఇబ్బందులు ఉంటున్నాయి. వాటర్బోర్డు అధికారులు మాత్రం సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నప్పటికీ, శాశ్వత చర్యలు తీసుకోవట్లేదు.
నిర్వహణ లోపంతోనే..
డ్రైనేజీ పైపులైన్ల మరమతులు, నిర్వహణపేరుతో ప్రతినెల కోట్లలో వాటర్బోర్డు ఖర్చు చేస్తుండగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపట్లేదు. వానాకాలంలో వరదనీటితో మ్యాన్ హోల్స్జామ్అయి తరచూ పొంగడం సాధారమే. కానీ, సమ్మర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లోనైతే వర్షాకాలాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడో నిర్మించిన డ్రైనేజీ సిస్టమ్కావడంతోనే సమస్య ఏర్పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జనాభాకు అనుగుణంగా సిటీలో డ్రైనేజీ సిస్టం లేదని ఎక్స్ పర్ట్స్అంటున్నారు. సిటీలో అవసరమైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెంటనే పనులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
అల్వాల్వెంకటాపురం కాలనీలోని ఎస్ బీఐ బ్యాంక్ లేన్ రోడ్డులో15 రోజులుగా మ్యాన్ హోల్ పొంగిపొర్లుతోంది. ఎప్పుడూ ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపండి..అంటూ స్థానికుడు నర్సింగ్ సోమవారం వాటర్బోర్డు అధికారులకు ట్విట్టర్లో కంప్లయింట్ చేసిండు.”
లంగర్ హౌస్మెయిన్ రోడ్డుపై 3 రోజులుగా మురుగు పారుతోంది. దీంతో రాకపోకలకు జనం ఇబ్బంది పడుతుండడమే కాకుండా ఇతర కాలనీల్లోకి వెళ్లేవారికి సమస్యగా మారింది. దీనికి త్వరగా పరిష్కారం చూపాలని అడ్వకేట్ బల్వంత్ రెడ్డి సోమవారం వాటర్బోర్డు, కేటీఆర్కు ట్విట్టర్లో పోస్ట్ చేసిండు’’.
లంగర్ హౌస్మెయిన్ రోడ్డుపై 3 రోజులుగా మురుగు పారుతోంది. దీంతో రాకపోకలకు జనం ఇబ్బంది పడుతుండడమే కాకుండా ఇతర కాలనీల్లోకి వెళ్లేవారికి సమస్యగా మారింది. దీనికి త్వరగా పరిష్కారం చూపాలని అడ్వకేట్ బల్వంత్ రెడ్డి సోమవారం వాటర్బోర్డు, కేటీఆర్కు ట్విట్టర్లో పోస్ట్ చేసిండు’’.