ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తించడనేది పాత సామెత.. పోలీసులు గుర్తిస్తారనేది నేటి సామెత అవును మరి దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే దొంగ ఎవరనేది కనిపెట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇంటి వ్యక్తే తన ఇళ్లుకి కన్నం వేసిందని గుర్తించారు పోలీసులు. ఇంతకు ఎక్కడంటే..
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో చోరీ డ్రామా కలకలం రేపింది. తాను వాష్ రూంలో ఉన్న సమయంలో ఇంట్లోకి దొంగలు ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారని ఓ యువతి కేకలు వేసింది. అందరూ ఉండగానే.. పక్కింట్లో దొంగలు పడడంతో ఒక్కసారిగా స్థానికులు భయబ్రాంతులను గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలంచి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకుని యువతి చోరీ డ్రామా చేసిందని పోలీస్ అధికారులు గుర్తించారు.