అసలు వదిలేసి.. కొసరు కూల్చిన్రు

అసలు వదిలేసి.. కొసరు కూల్చిన్రు

రామచంద్రాపురం, వెలుగు: చెరువులు, కుంటలను కాపాడాల్సిన అధికారులు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​మండలం కిష్టారెడ్డిపేట సర్వే నంబర్​131లోని నక్కలపాడు కుంట ఎఫ్టీఎల్‌ పరిధిలో కబ్జాలపై ‘రీ సర్వేతో డ్రామాలు’ హెడ్డింగ్‌తో ఈ నెల 4 న ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఓ లీడర్‌‌ 30 గంటలు కబ్జా చేసి పదుల సంఖ్యలో నిర్మాణాలు చేపట్టిన విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించారు. కానీ, ముందుగా చెప్పినట్లు తూతూ మంత్రంగానే చర్యలు తీసుకున్నారు. మంగళవారం అక్కడికి వెళ్లి కేవలం ప్రహరీ కూల్చివేసి బిల్డింగ్ నిర్మాణాలు మాత్రం వదిలేశారు.  30 గుంటల భూమి ఎఫ్​టీఎల్​లోకి వస్తుందని హెచ్​ఎండీఏ క్లియర్​గా మార్క్​ చేసినా.. కేవలం గోడ కూల్చి వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.