తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,892 మందికి టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. ఇవాళ కరోనా కారణంగా ఒక పేషెంట్ మరణించారని, 3590 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,79,971కి, మృతుల సంఖ్య 4,102కు చేరినట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 7,54,399 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం రికవరీ రేటు 96.27 శాతంగా, డెత్ రేటు 0.53 శాతంగా ఉందని తెలిపింది.


రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో 78 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక నల్లగొండలో 45, సిద్దిపేటలో 42, సంగారెడ్డిలో 40, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 38 మంది చొప్పున కరోనా బారినపడ్డారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 21,470 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

కాలేజీకి వెళ్లే యువతులకు ఫ్రీగా స్కూటీలు ఇస్తం

మంచు కొండలు విరిగిపడి.. ఏడుగురు సైనికుల మృతి

తెలుగు సీఎంను కాంగ్రెస్ పార్టీ అవమానించింది