గురువారం ముచ్చింతల్కు రాష్ట్రపతి

గురువారం ముచ్చింతల్కు రాష్ట్రపతి

శీతాకాలం విడిది కోసం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. బుధవారం భద్రాద్రి, రామప్ప ఆలయాలను ఆమె సందర్శించారు. 29వ తేదీన (గురువారం) ముచ్చింతల్ లోని సమతా మూర్తిని ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం 5:15 గంటలకు చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన  గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారు. అక్కడ ఆమెకు చినజీయర్ స్వామి స్వాగతం పలుకుతారు.

108 దివ్య దేశాలు సందర్శిస్తూ.. ఆ తర్వాత రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడి నుంచి రామానుజన స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అక్కడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు  చిన జీయర్ స్వామి మంగళ శాసనాలు ఇస్తారు. ఆ తరువాత  డైనమిక్ ఫౌంటైన్ షోను రాష్ట్రపతి తిలకించి, సందర్శకులని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.