Rahul Dravid: టీమిండియాకు గుడ్ బై.. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ద్రవిడ్..?

Rahul Dravid: టీమిండియాకు గుడ్ బై.. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ద్రవిడ్..?

టీమిండియా ది వాల్, మిస్టర్ డిపెండబుల్ గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ భారత కోచ్ పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ప్లేయర్ గా, కెప్టెన్ గా అందుకోలేని వరల్డ్ కప్ ను కోచ్ గా సాధించి ఐసీసీ ట్రోఫీ లేని వెలితిని తీర్చుకున్నాడు. అయితే ఇప్పుడు అతని సేవలను ఐపీఎల్ ఫ్రాంఛైజీ వాడుకోవాలని చూస్తుంది. 

2024 ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. రానున్న సీజన్ కు తమ జట్టు మెంటార్ గా ద్రవిడ్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కేకేఆర్ ఫ్రాంచైజీ ద్రవిడ్ ను ఈ రోల్ కోసం సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ లో కేకేఆర్ మెంటార్ గా గంభీర్ జట్టుకు ట్రోఫీ అందించాడు. కోల్ కతా టైటిల్ గెలవడంతో గంభీర్ దే కీలక పాత్ర. అయితే గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన నాటి నుంచి గంభీర్ పేరు బాగా వినిపిస్తోంది. అతను భారత జట్టును విజయపథంలో నడిపించగలరని మాజీలు చెప్పుకొచ్చారు.  

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల(జూన్) చివరి వారంలో బీసీసీఐ పెద్దలు.. గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. శ్రీలంకతో జూలై నెలాఖరులో జరగబోయే సిరీస్ కు గంభీర్ కోచ్ గా రావడం దాదాపుగా ఖాయమైంది. దీంతో గంభీర్ లేని లోటును ద్రవిడ్ మాత్రమే పూరించగలడని కేకేఆర్ జట్టు భావిస్తోందట. కేకేఆర్ తో పాటు మరి కొంతమంది ఐపీఎల్ ఫ్రాంచైజీలు ద్రవిడ్ వైపు చూస్తున్నట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.