బెంగళూరు: డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కు బయలుదేరే ముందు టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఎన్‌సీఏలో విమెన్స్ టీమ్‌తో మాట్లాడాడు. బంగ్లాదేశ్ టూర్ నేపథ్యంలో వాళ్లలో స్ఫూర్తి నింపాడు. ఆటను మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు మ్యాచ్‌కు సన్నద్ధత, నిరంతర అభివృద్ధి వంటి అంశాలపై వాళ్లతో చర్చించాడు. విమెన్స్ టాప్ ప్లేయర్లు అడిగిన సందేహాలకు చీఫ్ కోచ్ ఓపికగా సమాధానాలిచ్చాడు. ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
‘బంగ్లా టూర్‌కు రెడీ అవుతున్న విమెన్స్ టీమ్ ఎన్‌సీఏలో ఉంది. వాళ్లతో చీఫ్ కోచ్ ద్రవిడ్ సమావేశం చాలా చక్కగా సాగింది. ఆటకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలను చర్చించారు. ఇందుకోసం టైమ్ వెచ్చించిన ద్రవిడ్‌కు ధన్యవాదాలు’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. దీప్తి, షెఫాలీ, రిచా, జెమీమా, రాజేశ్వరి, పుజా వస్త్రాకర్, దేవికా వైద్య, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, అరుంధతి రెడ్డి ఈ సెషన్‌కు హాజరయ్యారు.