
- రంగారెడ్డి కలెక్టరేట్లో ఆగస్టు 30న డబుల్ ఇండ్లకు డ్రా
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు బుధవారం డ్రా తీయనున్నట్టు రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల నుంచి 93,899 అప్లికేషన్లు అందాయని పేర్కొన్నారు.
మొదటి విడతగా అర్హత సాధించిన 12,479 దరఖాస్తుల్లో ఒక్కో సెగ్మెంట్‌కు 500 లబ్ధిదారుల చొప్పున మొత్తం 2 వేల మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో డ్రా కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.