ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సోషల్ ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్ చేయని సెక్రటరీపై డీఆర్డీవో ఫైర్

కోటగిరి, వెలుగు: ‘గ్రామ పంచాయతీ ఏమైనా.. నీ ఇంటి జాగీరా..’ అని మండలంలోని ఎక్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ జీపీ సెక్రటరీ స్వాతిపై డీఆర్డీవో చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పనులపై కోటగిరి మండలంలో వారం రోజులుగా నిర్వహించిన సోషల్ ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురువారం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంగణంలో ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 28 జీపీలుండగా 15 జీపీల్లో నిర్వహించిన సోషల్ ఆడిట్ నివేదికను గురువారం డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీలు చదివి వినిపించారు. చాలా గ్రామాల్లో పెట్టిన  హరితహారం మొక్కలు చనిపోతున్నట్లు ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడైంది. కొన్ని గ్రామాల్లో 80 శాతంపైగా మొక్కలు చనిపోయినట్లు తేలింది.మొక్కలు చనిపోయినప్పటికీ వాటి మెయింటెనెస్స్ చార్జీలు తీసుకోవడం గమనార్హం. ఎక్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీల బృందానికి సహకరించకుండా జీపీలో ఉండొద్దని వారించిన పంచాయతీ సెక్రటరీపై డీఆర్డీవో మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వెంటనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కాగా గురువారం 15 జీపీల నివేదిక చదవగా మిగిలిన 13 జీపీలపై శుక్రవారం ప్రజావేదిక జరుగనుంది. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ వల్లేపల్లి సునీత, వెస్ ఎంపీపీ గంగాధర్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ తిరుపతి, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఎంపీడీవో మారుతి, ఏపీవో రమణ పాల్గొన్నారు.

నేను అలా అనలేదు..

గ్రామస్తులకు కొన్ని సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉన్నందున తన రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వారిని పక్కనే ఉన్న మరో రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లాలని చెప్పాను తాను వేరే ఏమీ అనలేదని సెక్రటరీ స్వాతి పేర్కొన్నారు. సోమవారం సర్టిఫికెట్ల బిజీ, మంగళవారం జీపీ ఆడిటర్ రావడంతో వారితో ఫీల్డ్ విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లలేకపోయానని చెప్పారు. ఇందుకు ఎంపీడీవో పర్మిషన్  కూడా తీసుకున్నట్లు తెలిపారు.

డిగ్రీ కాలేజీలో ముగిసిన న్యాక్‌‌‌‌ టీం తనిఖీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఆర్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ సైన్స్‌‌‌‌ కాలేజీలో రెండు రోజుల పాటు కొనసాగిన న్యాక్‌‌‌‌ టీం పరిశీలన గురువారంతో పూర్తైంది. జమ్మూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌ మనోజ్‌‌‌‌ ధర్‌‌‌‌ నేతృత్వంలో ధార్వాడ్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ శివపుత్ర పతగుండి, ముంబాయికి చెందిన డాక్టర్‌‌‌‌ ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌లు కాలేజీలో 15 విభాగాల్లో టీచింగ్‌‌‌‌, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌, ఎన్‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, కెరీర్‌‌‌‌ గైడెన్స్‌‌‌‌, లైబ్రరీ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలో బొటానికల్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌ను పరిశీలించిన అనంతరం వాననీటి సంరక్షణకు చేపట్టిన చర్యలు, ల్యాబ్‌‌‌‌లలో  మౌలిక వసతులను పరిశీలించారు. తర్వాత కాలేజీ స్టాఫ్‌‌‌‌తో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. అలాగే కాలేజీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్​ డాక్టర్​ కె. కిష్టయ్య, వైస్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌ చంద్రకాంత్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌‌‌‌ డాక్టర్​పి.రామకృష్ణ   తదితరులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ విడుదల చేయాలి

కామారెడ్డి, వెలుగు : పెండింగ్‌‌‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ బకాయిలను విడదుల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌‌‌‌ గుజ్జరి కృష్ణ డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మేరకు గురువారం కామారెడ్డిలోని కొత్త బస్టాండ్‌‌‌‌ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లకు రూ. 3,800 కోట్ల బకాయి ఉందన్నారు. నీళ్లు, నియామకాలు, నిధుల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం స్టూడెంట్లు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా విద్యాశాఖను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజయ్, జోనల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి చరణ్​, ఖలీల్, సమీర్, అజయ్, సాయి పాల్గొన్నారు.

నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ జరిపించాలి

నిజామాబాద్,  వెలుగు: అర్బన్ శివారులోని మాధవ నగర్ సొసైటీలో జరిగిన రూ. 20 లక్షల గోల్ మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. అవకతవకలకు పాల్పడిన ఆఫీసర్లపై చర్యలు చేపట్టాలని కోరారు. సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రైతులు మాట్లాడారు. 2018 నుంచి 2020 వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సొసైటీ పాలన కొనసాగిందని చెప్పారు. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు వారు ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమావేశంలో కార్పొరేటర్ ప్రమోద్, కార్యదర్శి వంశీ, రైతులు   తదితరులు పాల్గొన్నారు

రెండో రోజూ సాగిన బీజేపీ దీక్ష

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన భూ అక్రమాలపై కలెక్టర్​ స్పందించాలని డిమాండ్ చేస్తూ  బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష గురువారం కూడా కొనసాగింది. దీక్షలో పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డితో పాటు లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్​ ఆఫీసు చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పట్టా భూములను ఆబాదీ భూములుగా చూపెట్టి, పేద, మధ్య తరగతి రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గవర్నమెంట్​ భూములు కబ్జా అవుతున్నా పట్టించురకోవడం లేదన్నారు.  కలెక్టర్​ స్పందించి చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు సాగిస్తామన్నారు. పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్​, మున్సిపల్​ఫ్లోర్​ లీడర్​ శ్రీకాంత్, కౌన్సిలర్లు సుజిత, నరేందర్, రవి, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లీడర్లు భరత్, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రతాప్, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.  

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నాచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ ఇంట్లో బంగారు నగలు ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుభాష్ నగర్ లోని కొండ గంగ లక్ష్మికి మాయమాటలు చెప్పి ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగలించి పారిపోయాడు. ఈ కేసును చేధించిన పోలీసులు  దొంగతనానికి పాల్పడిన మార్వాడి గల్లీకి చెందిన తివాడి యాష్ (22) ను అరెస్టు చేసి బంగారాన్ని  స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపారు. కేసును చేదించిన ఎస్సై నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిబ్బంది వెంకట్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అఫ్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏసీపీ అభినందించారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి

బోధన్‌‌‌‌, వెలుగు : మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్‌‌‌‌ యూత్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ తలారి నవీన్‌‌‌‌ మాట్లాడుతూ బోధన్​ మండలంలోని మందర్నా, హున్సా, కొప్పర్గ, ఖండ్‌‌‌‌గావ్‌‌‌‌ ప్రాంతాల నుంచి రాత్రివేళ కొందరు వ్యక్తులు ఇసుకను తరలిస్తున్నా పోలీస్‌‌‌‌, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానికంగా ఇండ్లు కట్టుకునే వారికి దొరకని ఇసుక అక్రమార్కులకు ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. ఆఫీసర్లు స్పందించి ఇసుక రవాణాను అడ్డుకోకపోతే కాంగ్రెస్‌‌‌‌ ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌‌‌‌ వరప్రసాద్‌‌‌‌కు వివతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ టౌన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కలీం, ఎస్టీఎస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ రామకృష్ణ, వాహిద్, జహీర్, ఇస్మాయిల్, బాలకృష్ణ పాల్గొన్నారు. 

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు పతనం మొదలైంది

నిజామాబాద్, వెలుగు: టీఆర్ఎస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే వారిని పతనానికి చేరువ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణ అన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి గురువారం ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తుందన్నారు. యాత్రను అడ్డుకోవాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, వైస్​ ప్రెసిడెంట్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మాస్టర్​ శంకర్, మధు, లీడర్లు పంచరెడ్డి శ్రీధర్, భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వినోద్, అమంద్, విజయ్  తదితరులు పాల్గొన్నారు. యాత్రకు తరలిన బీజేపీ శ్రేణులు పిట్లం, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జుక్కల్ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. గురువారం ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనాల్లో ఆరు మండలాల నుంచి వెళ్లారు.

జలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపీపై ఫిర్యాదు

వర్ని, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ని మండలం జలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని గురువారం హైదరాబాద్ పంచాయతీ రాజ్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ వర్ని మండల ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.గ్రామస్తులతో కలిసి తాము పలుమార్లు డీపీవో, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించ లేదని డీపీవోను ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మందలించినట్లు చెప్పారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారని పేర్కొన్నారు. కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసిన వారిలో  గోవర్ధన్, సాయిలు, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగుతో లాభాలు

నవీపేట్, వెలుగు: ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నందిగామ విలేజ్ నుంచి గురువారం ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటకు 12 మంది రైతులను తోటల పెంపకంపై శిక్షణ కోసం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. అయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పామ్ పెంపకానికి గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రైతులు సంజీవ్, కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, భూమారావు, రాజన్న పాల్గొన్నారు.                      

క్యాంపస్ సెలక్షన్స్​

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే డిగ్రీ, పీజీ కాలేజీలో గురువారం ఐసీఐసీఐ బ్యాంక్ క్యాంపస్ సెలక్షన్స్​ నిర్వహించింది. సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 271 మంది స్టూడెంట్లు పాల్గొనగా 21 మంది సెలక్ట్ అయ్యారు. కాలేజీ కరస్పాండెంట్ జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ క్యాంపస్ సెలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్టూడెంట్లకు మేలు జరుగుతుందన్నారు. స్టూడెంట్లు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఏ.దత్తాద్రి, ప్రతినిధులు మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సందీప్, బాల్​రెడ్డి, కుమార్, ప్రణయ్ పాల్గొన్నారు.  

బాధిత కుటుంబానికి బీజేపీ లీడర్ల పరామర్శ

సిరికొండ,వెలుగు: మండలంలోని కొండూర్​ గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు  జనార్దన్‌‌రెడ్డి కుమారుడు వారం రోజుల కింద మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ రూరల్ ఇన్‌‌చార్జి దినేశ్‌‌ , డిచ్‌‌పల్లి ఎంపీపీ గద్దె భూమన్న గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, కర్క గంగారెడ్డి, రంజిత్‌‌రెడ్డి, లింబాద్రి ఉన్నారు.

కనకల్ శివారులో ఒకరి హత్య

తాడ్వాయి, వెలుగు:  మండలంలోని కనకల్ శివారులోని ఉసిరికాయ గడ్డ ప్రాంతంలో కామారెడ్డి దేవునిపల్లికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశారని ఏఎస్సై సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవునిపల్లికి చెందిన ఫకీర్ షబ్బీర్ (31) దిన సరి కూలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 20న ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన షబ్బీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య నసీమ 21వ తేదీ  పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం కనకల్ గ్రామస్తులు నుంచి తాడ్వాయి పోలీసులకు తమ గ్రామ శివారులో గుర్తు తెలియని శవం ఉన్నట్లుగా సమాచారం అందడంతో వెళ్లి ఎంక్వైరీ చేసి షబ్బీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. ఎవరో తల, పొట్ట పైన కొట్టి చంపినట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.