
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్డీవో - రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ సైంటిస్ట్ ‘బి’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్), డీఎస్టీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఏడీఏ (ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
ఖాళీలు: మొత్తం 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆర్డీవోలో -579, ఏడీఏలో -43, డీఎస్టీలో -8 పోస్టులు ఉన్నాయి. వయసు 28 నుంచి 35 ఏండ్లు ఉండాలి.
అర్హత: పోస్టును బట్టి స్పెషలైజేషన్‌తో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉండాలి. గేట్ పరీక్షలో తగిన స్కోరు లేదా ఐఐటీ - ఎన్‌ఐటీ పట్టభద్రులైతే 80 శాతం మార్కులు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోరు, రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అప్లికేషన్ లింక్ తెరుచుకున్న 21 రోజుల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అక్టోబర్ 16న రాతపరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు 01123889528 ఫోన్ నంబర్ లేదా www.rac.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.