
డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) 224 స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్ టైపింగ్), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్(హిందీ, ఇంగ్లిష్ టైపింగ్), సెక్యురిటీ అసిస్టెంట్, క్లర్క్, ఫైర్ ఇంజిన్ ఆపరేటర్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: పదోతరగతి, ఇంటర్/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: టైర్–1( కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష), టైర్–2( ట్రేడ్/ స్కిల్/ ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ కేపబిలిటీ టెస్ట్) ద్వారా.
పరీక్ష విధానం: రిటెన్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం120 నిమిషాలు. టైర్–2 పరీక్ష రాయాలంటే టైర్–1లో జనరల్, ఓబీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబరు 21
చివరితేది: 2019 అక్టోబర్ 15
వివరాలకు: www.drdo.gov.in