Job News : DRDOలో 204 సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Job News : DRDOలో 204 సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశ రక్షణకు సంబంధించిన కీలక పరిశోధనలు సాగించే.. డీఆర్డీఓలో 204 సైంటిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.  DRDO రిక్రూట్‌మెంట్ & అసెస్‌మెంట్ సెంటర్ (RAC) సైంటిస్ట్ బి పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా DRDO సైంటిస్ట్ B, గ్రూప్ 'A' (గెజిటెడ్) పోస్టులకు అర్హులైన వారిని నియమిస్తారు. నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్ drdo.gov.inలోకి వెళ్లి ఆప్లై చేసుకోవచ్చు. 

* DRDO RAC రిక్రూట్‌మెంట్ 2023 ద్వారా.. మొత్తం 204 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2023. 

* GATE స్కోర్‌తో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

* B.Tech/ BE చేసిన వాళ్లు అర్హులు. 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లాగిన్ అయ్యి..దరఖాస్తు ఫారమ్  పూర్తిగా నింపాలి. అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అందించిన సూచనల ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి.

దరఖాస్తు ఇలా చేయాలి..

* drdo.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

* హోమ్‌పేజీలో, కెరీర్‌ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

* సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ పేజీని సందర్శించండి. అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

* మీ పూర్తి వివరాలను నమోదు చేసుకోండి.. లాగిన్ చేయండి

* అప్లికేషన్ ను పూర్తిగా నింపాలి. సర్టిఫికెట్లను పొందుపర్చాలి. ఫీజు కూడా చెల్లించాలి.
పూర్తి చేసిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి. 

* షార్ట్‌లిస్టింగ్ నిబంధనల ప్రకారం.. గేట్ స్కోర్, కటాఫ్ స్కోర్ కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి.