గంగాధర, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీవో శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గంగాధర మండలం మధురానగర్, నారాయణపూర్, నాగిరెడ్డిపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆదివారం ఆయన పరిశీలించారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులతోపాటు లారీల్లో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలని, తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ధాన్యానికి సరిపడా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట డీపీఎం ప్రవీణ్, ఏపీఎంలు రాజేశం, పవన్‌కుమార్, సీసీలు, వీవోఏలు ఉన్నారు.