గురితప్పని జొరావర్‌.. పరీక్షలు విజయవంతం

గురితప్పని జొరావర్‌.. పరీక్షలు విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్‌ విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసింది. ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ లక్ష్యాలన్నీ నెరవేరాయని రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ట్యాంకు బరువు దాదాపు 25 టన్నులు ఉంటుంది. 

తేలిక పాటి బరువు ఉంటుంది కనుక దీనిని వాయు మార్గంలోనూ తరలించ వచ్చని రక్షణ తెలిపింది. L&T సహకారంతో డీఆర్‌డీవో (DRDO) దీనిని అభివృద్ధి చేసింది. సెప్టెంబరు 13న డీఆర్‌డీవో జొరావర్ ప్రాథమిక ఆటోమోటివ్ పరీక్షల నిర్వహించింది. దీనిని ఎత్తైన ప్రదేశాలలో మోహరించడానికి రూపొందించారు. ముఖ్యంగా చైనా వెంబడి ఉన్న సరిహద్దుల్లో దీన్ని మోహరించనున్నారు. 2027 నాటికి వీటిని భారత సైన్యంలో చేర్చవచ్చు. కాగా, చైనా ఇప్పటికే ఇలాంటి ట్యాంకులను రంగంలోకి దించింది.

జనరల్ జోరావర్ సింగ్

1834 నుండి 1841 వరకు లడఖ్, టిబెట్లలో డోగ్రా సైన్యాన్ని విజయవంతంగా నడిపించిన ప్రఖ్యాత జనరల్ జోరావర్ సింగ్ పేరు మీద ట్యాంకుకు ఆ పేరు పెట్టారు. ఆయన 1841లో 5,000 మంది సైనికులతో కూడిన డోగ్రా సైన్యానికి నాయకత్వం వహించారు.