డీఆర్​డీఓ స్వదేశీ ఇంటిగ్రేటెడ్​ లైఫ్​ సపోర్ట్​ సిస్టమ్​ సక్సెస్..

డీఆర్​డీఓ స్వదేశీ ఇంటిగ్రేటెడ్​ లైఫ్​ సపోర్ట్​ సిస్టమ్​ సక్సెస్..

డిఫెన్స్ రీసెర్చ్​ అండ్​ డెవలప్​ మెంట్​ ఆర్గనైజేషన్(డీఆర్​డీఓ) కింద పనిచేసే బెంగళూరుకు చెందిన డిఫెన్స్​ బయో ఇంజినీరింగ్​అండ్​ ఎలక్ట్రో మెడికల్​ లాబొరేటరీ ఎల్​సీఏ తేజస్ విమానం కోసం స్వదేశీ ఆన్​ బోర్డ్​ ఆక్సిజన్​ జనరేటింగ్​ సిస్టమ్​బేస్డ్​ ఇంటిగ్రేటెడ్​ లైఫ్​ సపోర్ట్​ సిస్టమ్​ హౌ ఆల్టిట్యూడ్​ ట్రయల్స్​ను విజయవంతంగా నిర్వహించింది. 

గగనతలంలో అత్యంత ఎత్తుకు వెళ్లే యుద్ధ విమానాల్లో పైలట్లు ఆక్సిజన్​ కోసం సంప్రదాయ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, లోహ విహంగంలోనే ప్రాణ వాయువును ఉత్పత్తి చేసే వ్యవస్థ(ఓబీఓజీఎస్)ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఓబీఓజీఎస్​ తయారీలో డీఆర్ డీఓ, ఎల్​ అండ్​ టీ కలిసి పనిచేశాయి.