Battle tank Zorawar: ఇండియన్ ఆర్మీకోసం లైట్ యుద్ధ ట్యాంక్..టెస్టింగ్ సక్సెస్ 

Battle tank Zorawar: ఇండియన్ ఆర్మీకోసం లైట్ యుద్ధ ట్యాంక్..టెస్టింగ్ సక్సెస్ 

Battle tank Zorawar: భారత ఆర్మీ కోసం డీఆర్డీఏ  కొత్త యుద్ద ట్యాంక్ ను తయారు చేసింది. జొరావర్ అని పిలువబడే ఈ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంక్ను శనివారం ( జూలై 6) డీఆర్ డీఏ విజయవంతంగా పరీక్షించింది. ఈయుద్ధ ట్యాంకును DRDO, L&T సంయుక్తంగా రూపొందించాయి. ఎత్తయిన పర్వతాలు, నదులను సమర్థవం తంగా దాటే కెపాసిటీతో ఈ యుద్ధ ట్యాంకును నిర్మించారు. ఈ యుద్ధ ట్యాంకులు హెవీ వెయిట్ ఉన్న T-72, T90 యుద్ద ట్యాంకుల కంటే ఎక్కువ కెపాసిటీ గలిగినది. జొరావర్  లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకులు 2027 లో ఇండియన్ ఆర్మీ చేతికి అందుతాయని డీఆర్ డీవో చీప్ చెప్పారు. 

జొరావర్ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకును లఢఖ్ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో వినియోగించేందుకు భారత ఆర్మీకి మరింత శక్తి సామర్థ్యాలను అందించేందుకు రూపొందిచిన లైట్ వెయిట్ యుద్ధ ట్యాంకు. లడఖ్, పశ్చిమ టిబెట్ దండయాత్రకు నేతృత్వం వహించిన 19వ శతాబ్ధపు డోగ్రా జోరావర్ సింగ్ పేరు మీదుగా దీనికి జోరావర్ అని పేరుపెట్టారు. 

జొరావర్ చాలా తేలికగా ఎక్కువ మందు గుండు సామాగ్రి, రక్షణ, నిఘా, కమ్యూనికేషన్ కెపాసిటీని కలిగి ఉంటుంది. దీని బరువు కేవలం 25 టన్నులు మాత్రమే. T90 యుద్ద ట్యాంక్ బరువులో సగం మాత్రమే. పెద్ద ట్యాంకులు చేరుకోలేని కష్టతరమైన పర్వత ప్రాంతాల్లో ఈ యుద్ద ట్యాంకు లు పనిచేస్తాయి.

త్వరలో 59 జొరావర్ యుద్ద ట్యాంకులు భారత సైన్యానికి అమ్ముల పొదికి చేరనున్నాయి. 354 లైట్ యుద్ద ట్యాంకులను కొనుగోలు చేయాలని ఆర్మీ ప్రణాళికలు సిద్దం చేసింది. చైనా ఇప్పటికే టైప్ 15 వంటి తేలికపాటి పర్వత ట్యాంకుల ప్రయోజనాన్ని పొందుతోంది. లడఖ్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో చైనా ను ఎదుర్కొనేందుకు ఈ యుద్దట్యాంకులు సహాయపడనున్నాయి.