ప్రతి ఇంట్లో ఒక్క మహిళైనా ..స్వయం సహాయక సంఘంలో ఉండాలి :  విద్యాచందన 

ప్రతి ఇంట్లో ఒక్క మహిళైనా ..స్వయం సహాయక సంఘంలో ఉండాలి :  విద్యాచందన 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రతి ఇంట్లో ఒక మహిళైనా తప్పనిసరిగా స్వయం సహాయక సంఘం సభ్యురాలై ఉండాలని డీఆర్డీవో విద్యాచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లాలోని  సెర్ప్ కార్యక్రమాలపై మండల ఏపీఎంలు, సీసీలతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.

సామర్థ్యం, ఆసక్తి ప్రకారం పథకాలకు ఎంపిక చేయాలని సూచించారు. ప్రతీ సంఘం క్రియాశీలకంగా ఉండేలా యాక్షన్​ ప్లాన్​ ఉండాలన్నారు. సీఐఎఫ్​ బ్యాంకు లింకేజీ పూర్తి చేయాలని చెప్పారు. ఏపీఎంలు, సీసీలు నెలవారీ లక్ష్యాలను వంద శాతం సాధించాలని ఆదేశించారు. ఈ మీటింగ్​లో అడిషనల్​డీఆర్డీవో శ్రీనిధి, రీజనల్​ మేనేజర్, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు.