ట్రాన్స్ జెండర్లంతా ఓటు వేయాలి : విజయలక్ష్మి

నిర్మల్, వెలుగు: జిల్లాలోని ట్రాన్స్​జెండర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఆర్​డీఓ విజయలక్ష్మి కోరారు. శనివారం స్వీప్ ఆధ్వర్యంలో ట్రాన్స్​జెండర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు లేనివారంతా తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఓటుతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందన్నారు. జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ నాగమణి పాల్గొన్నారు.