వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద స్టెల్త్ రకం యుద్ధ విమానాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేయనున్నది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను తమిళనాడులోని సూలూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ 2024లో డీఆర్డీవో ప్రదర్శించింది. 2035 నాటికి భారత అమ్ములపొదిలో 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ చేరనున్నది. ఇవి సిద్ధమైతే స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన మన దేశం నిలువనున్నది. ఏడు టన్నుల బరువు ఉండే ఏఎంసీఏ విమానాలు క్షిపణులు సహా భారీ ఆయుధ సామగ్రిని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపింది.
డీఆర్డీవో ప్రస్తుతం అత్యాధునిక 5.5 జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏను అభివృద్ధి చేస్తున్నది. అతికొద్ది దేశాల వైమానిక దళంలో ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు డీఆర్డీవో తెలిపింది.
ప్రస్తుతం భారత వైమానిక దళంలో స్టెల్త్ రకం యుద్ధ విమానాలు, అభివృద్ధి సాంకేతికతలు లేవు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఏఎంసీఏ 2034 నాటికి ట్రయల్స్ పూర్తి చేసుకోనున్నాయి. 2035 నాటికి వీటిని వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.