జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్‌‌‌‌’.. కలల నేపథ్యంలో థ్రిల్లర్

జనవరి 3న  ‘డ్రీమ్ క్యాచర్‌‌‌‌’.. కలల నేపథ్యంలో థ్రిల్లర్

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘డ్రీమ్ క్యాచర్‌‌‌‌’.  సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. జనవరి 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో దీన్ని తెరకెక్కించా. ‘ఇన్ సెప్షన్’ లాంటి చిత్రాల స్ఫూర్తితో, నాకున్న వనరులతో ఒక హాలీవుడ్ స్థాయి ప్రయత్నం చేశాను.

కలల నేపథ్యంలో ఇలాంటి చిత్రం తెలుగులో ఇంతవరకూ రాలేదు.  పాటలు, ఫైట్స్ ఉండవు. నిడివి కూడా గంటన్నర మాత్రమే.  ఒక మంచి చిత్రం తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నాడు.  సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా సరికొత్త ఎక్స్‌ పీరియన్స్ ఈ సినిమా ఆకట్టుకుంటుంది అని హీరో ప్రశాంత్ కృష్ణ చెప్పాడు.  నటీనటులు అచ్యస సిన్హా, శ్రీనివాస్ రామిరెడ్డి,  నాగరాజు, డీవోపీ ప్రణీత్ గౌతమ్ నందా తదితరులు పాల్గొన్నారు.