ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చేది డీఆర్ఎఫ్ సిబ్బందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సైతం హైదరాబాద్లో వారే ముందుండి పబ్లిక్ సమస్యల్ని పరిష్కరించారు.
రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తూ, వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. నేలకొరిగిన చెట్లను తొలగించారు. భారీ వర్షంలోనూ పబ్లిక్ సమస్యలు పరిష్కరించారు.
ప్రకృతి వైపరీత్యాలపై ఆగస్టు 3న సంతోష్ నగర్లోని సైనిక్ స్కూల్ లో విద్యార్థులకు డీఆర్ఎఫ్ టీం అవగాహన కల్పించింది. మానవ తప్పిదాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఎఫ్ఓ సతీశ్ రావు, డీఎం శ్రీరాం, అసిస్టెంట్స్ సంజీవ, శ్రీకాంత్, రవి, మోతీలాల్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.