చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ ..డీఆర్‌‌‌‌‌‌‌‌జీ జవాన్‌‌‌‌‌‌‌‌ మృతి

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ఓ డీఆర్‌‌‌‌‌‌‌‌జీ జవాన్‌‌‌‌‌‌‌‌ ప్రాణాలు కోల్పోయారు. అబూజ్‌‌‌‌‌‌‌‌మడ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలోని సోనాపూర్‌‌‌‌‌‌‌‌, -కోహ్కామేటా పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల పరిధిలో భద్రతాబలగాలు కూంబింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటి గంటకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. 

ఈ కాల్పుల్లో డీఆర్‌‌‌‌‌‌‌‌జీకి చెందిన బీరేంద్రకుమార్ (36)​ అనే జవాన్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించగా, అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు కూంబింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి.