5.96 కిలోల బంగారం పట్టివేత

చౌటుప్పల్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌‌‌‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి డీఆర్‌‌‌‌ఐ ఆఫీసర్లు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు ఫోర్డ్‌‌‌‌ కారులో కల్‌‌‌‌కత్తా నుంచి హైదరాబాద్‌‌‌‌కు బంగారం తరలిస్తున్నారని సమాచారం అందడంతో పంతంగి టోల్‌‌‌‌ ప్లాజా వద్ద ఆఫీసర్లు కారును ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 4.31 కోట్ల విలువైన 5.96 కిలోల బరువైన 35 బంగారు కడ్డీలు దొరికాయి. నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేసి, బంగారం, కారును సీజ్‌‌‌‌ 
చేసినట్లు పోలీసులు తెలిపారు.