కారులో 4 కేజీల బంగారం తెలివిగా పెట్టేశాడు.. అయినా పట్టుకున్నా DRI అధికారులు

కారులో 4 కేజీల బంగారం తెలివిగా పెట్టేశాడు.. అయినా పట్టుకున్నా DRI  అధికారులు

హైదరాబాద్ శివారులో విదేశీ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఓ కారును DRI (డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు గురువారం పట్టుకున్నారు. విదేశాల నుంచి దాదాపు నాలుగు కేజీల బంగారం కారులో సీక్రేట్ భాగంలో దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. తెలివిగా కారు కబోర్డులు, డ్యాష్ బోర్డ్, డ్రైవర్ సీట్, బ్యాక్ ట్రంక్ ఫ్రేమ్ లలో స్పెషల్ గోల్డ్ కాయిన్స్ తయారు చేసి దాచిపెట్టారు. అయినప్పటికీ DRI అధికారులు పట్టుకున్నారు. 

3వేల 982.070 గ్రాముల గోల్డ్ విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కారులో కోల్‌కతా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. పట్టుబడిన గోల్డ్ విలువ రూ. 2కోట్ల 94లక్షల 55 వేల 372 ఉంటుందని అధికారులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.