హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. లేటెస్ట్ గా హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు డీఆర్ఐ అధికారులు. వారి నుంచి 60 లక్షల విలువైన 3 కేజీల ఎఫిడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తుంది. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నారు.